అసిఫాబాద్: 2025-26 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి:రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
2025-26 ఖరీఫ్ సంబంధిత వరి ధాన్యం కొనుగోలు కొరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌరసరఫరాలు, వ్యవసాయ, రవాణా, ఎఫ్. సి. ఐ. శాఖల కమిషనర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలు, మార్కెటింగ్, సహకార, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, రవాణా, పోలీస్ శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.