అరటి కాయల మండి ఏజెంట్లు, ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై అరటి ధరలను దెబ్బతీస్తున్న వారిపై కరిగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అరటిని కిలో రూ.20 రూపాయల చొప్పున కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామ శివారులో చెన్నప్ప కొట్టాల ప్రాంతంలో అరటి పంటలను సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు.