ప్రకాశం జిల్లా బేస్తవారిపేట అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నిరసనకు దిగారు. బేస్తవారిపేట మండలం గొల్లపల్లి నుంచి ప్రతి రోజు 20 కిలోమీటర్ల ప్రయాణించి బేస్తవారిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి తిరిగి తమ గ్రామానికి వెళ్లే క్రమంలో సరైన సమయానికి బస్సు సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు తెలిపిన పట్టించుకోలేదని విద్యార్థినీలు, విద్యార్థులు వాపోయారు.