కూటమిలో విభేదాలకు తావులేదు: MLA కూటమి పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. స్థానిక పీఆర్ గెస్ట్ హౌస్ లో ఆయన మాట్లాడుతూ.. దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారంపై లేనిపోని అపోహాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈనెల 26న అందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. నవంబర్1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్లో అధికారులతో కలిసి డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.