కొండపి: కొండపి మండలం పెట్లూరులో సమీపంలో దారుణంగా దెబ్బతిన్న రహదారి, అవస్థలు పడుతున్న వాహనదారులు
ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులోని సహజానందస్వామిగుడి దగ్గర నుంచి దాదా నాయుడుపాలెం వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా మారింది. ఇది పొదిలి - కొండపి ప్రధాన రహదారి. ఈ రహదారి టంగుటూరు జాతీయ రహదారికి అనుసంధానం. దీంతో ప్రతినిత్యం అధిక సంఖ్యలో వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటాయి. కేవలం రెండు కిలోమీటర్లు రోడ్డు మరమ్మతులు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు.