నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురంలో గురువారం తెల్లవారుజామున బండి లక్ష్మీదేవికి సంబంధించిన పశువుల కొట్టం అగ్నిప్రమాదానికి గురైంది. రెండు చూడు గేదెలు, రెండు నర దూడలు ప్రమాదానికి గురైనాయి. విషయం తెలిసిన వెంటనే రుద్రవరం ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ వెళ్లి వాటికి చికిత్స అందించారు. వారివెంట గోపాల మిత్ర హుసేన్ ఉన్నారు.