పెద్దపప్పూరు మండల పరిధిలోని అశ్వర్థo క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు. పెన్నా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకించారు. పంచామృతాభిషేకం, కాగడ హారతి వంటి పూజలు నిర్వహించారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.