వాల్మీకిపురం మానవతా శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అగ్రమిగా నిలవడం హర్షనీయం:వ్యవస్థాపకులు ఎన్.రామచంద్రా రెడ్డి ప్రశంస
వాల్మీకిపురం మానవతా శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అగ్రమిగా నిలవడం హర్షనీయమని మానవతా సంస్థ వ్యవస్థాపకులు నిమ్మలపల్లి రామచంద్రా రెడ్డి ప్రశంసించారు. ఆదివారం వాల్మీకిపురం మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ శాఖను సంస్థ వ్యవస్థాపకులు నిమ్మలపల్లి రామచంద్ర రెడ్డి సందర్శించారు. సంస్థ విధి విధానాలను సభ్యులకు వివరించి విలువలతో కూడిన సమాజం ఏర్పడడానికి మానవతా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కృషి చేస్తున్నదని అన్నారు.పర్యావరణ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సాయి బాబా మందిరం ముందు మొక్కలు నాటారు. నైతిక సహకారంలో భాగంగా అనారోగ్య బాధితులు శ్రీకాంత్ కు 5వేలు,చలమకోట వెంకటరమణ కు ₹2500 ఆర్థిక సహకారం అందజేశారు