ముక్కంటి ఆలయంలో పలుచోట్ల డాగ్స్ కార్డు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో డాగ్ స్క్వాడ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఆలయంలోని పలుచోట్ల విస్తృత తనిఖీలు చేశారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరుగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ పరిసరాలు,ప్రసాదాల కౌంటర్లు, వాహనాల పార్కింగ్ స్థలాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.