పుంగనూరు: లారీ ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం హుటాహుటిన మరమ్మతులు చేసిన విద్యుత్ శాఖ అధికారులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా గల విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఘటన స్థలానికి విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో చేరుకొని విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునర్దించారు.