అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పట్టణంలోని బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల స్థలంలో అక్రమ కట్టడాల నిర్మాణం పై అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. సమావేశంలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.