గుంతకల్లు: గుత్తి మండలం గొందిపల్లి గ్రామంలో ఫోర్జరీ సంతకాలతో ఇంటి పట్టాలు, న్యాయం చేయాలని బాధితులు ఆందోళన
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని గొందిపల్లి గ్రామంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇంటి పట్టాలు కొందరు ఫోర్జరీ సంతకాలతో పట్టాలు సృష్టించి మాకు ఇచ్చిన స్థలాలు తనవి అంటూ దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. గుత్తి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం బాధితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబర్ 40-2Bలో 119, 120 నంబర్ ప్లాట్లు ప్రభుత్వం తమకు 1999 లో ఇచ్చిందని అన్నారు. అయితే కొందరు మాకు ఇచ్చిన పట్టాలను ఫోర్జరీ చేసి తమవి అంటూ మా భూములలోకి చొరబడుతున్నారని అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.