తాడేపల్లిగూడెం: పట్టణంలోని ఏపీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రీసెర్చ్ డిసిమినేషన్ అంశంపై శిక్షణ కార్యక్రమం.
లోహాలు పర్యావరణంతో రసాయన చర్య జరపడం వల్ల లోహ క్షయం ఏర్పడుతుందని ఏపీ ఎన్.ఐ.టి మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ డా.రఫీ మహ్మద్ తెలిపారు. ప్రపంచ లోహ క్షయం అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రీసెర్చ్ డిసిమినేషన్ అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.రఫీ మహ్మద్ మాట్లాడుతూ తేమ, ఆక్సిజన్ వంటి కాలుష్యం కారకాలు ప్రక్రియను వేగవంతం చేయడంతో లోహాలు మరింత బలహీన పడతాయన్నారు.ఈ కార్యక్రమంలో రిజిస్టర్ దినేష్ రెడ్డి, వీరేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.