గిద్దలూరు: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశానికి హాజరై సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అమూల్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరు కాగా ప్రజా సమస్యలపై వాడి వేడిగా చర్చ నడిచింది. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మండలంలో ఎక్కడా కూడా నీటి సమస్య లేకుండా చూడాలని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు.