మామిడి కాయల గిట్టుబాటు ధర లేక చెట్లు నరికివేత : ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
రైల్వే కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా మామిడికాయలకు ధర లేకపోవడంతో ఎంతో కష్టపడి పెంచుకున్న మామిడి చెట్లను రైతులు నరికి వేస్తున్నారు. రైల్వే కోడూరు మండలం జంగిటి వారి పల్లెకు చెందిన రవిచంద్ర తోతాపురి మామిడి చెట్లను నరికి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జ్యూస్ ఫ్యాక్టరీ దళార్లు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు దాదాపు 50 వేల రూపాయలు చేతి ఖర్చులు అయ్యాయి అన్నారు.