జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నాం : నెల్లూరు JSP జిల్లా నేత శ్రీరామ్
నెల్లూరు జిల్లాలో జనసేన బలోపేతానికి పాత కొత్త తరం నేతలు కలిసి పని చేయాలని జిల్లా జనసేన నేత శ్రీ రాము సూచించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరం ఒక్కతాటిపైకి వచ్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వాలను ఎక్కువగా చేస్తున్నామని వివరించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కృషి చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు