ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: మాజీ మంత్రి ఉసశ్రీ
వైసిపి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ ఆదివారం మధ్యాహ్నం పెనుకొండలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని పరిశీలించారు. జగన్ ఆదేశాల మేరకు ఆమె ఈ పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలతో పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. మంత్రి సవిత వ్యాఖ్యలపై మండిపడుతూ, ఇక్కడ మూడంతస్తుల భవనం ఉందని, దూకితేనే కాలేజీ కట్టామా లేదా అనేది తెలుస్తుందని అన్నారు.