ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఉల్లిపాయల లోడ్‌తో వస్తోన్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉల్లిపాయల లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు వాహనాలను మల్లించారు