పాణ్యం: ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో దుర్గామాత విగ్రహానికి, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు మల్లెల రాజశేఖర్ ప్రత్యేక పూజలు
ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో సోమవారం దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన శ్రీ దుర్గా మాత విగ్రహానికి టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.