చంద్రబాబు పాలనను దేవుడు కూడ క్షమించడని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఘటనలో 9 మంది మృతి కి సంతాపంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వైపీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కోవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు పార్టీ ఇన్చార్జి చుండూరి రవి లు ర్యాలీలో పాల్గొన్నారు