అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లో యూరియా కోసం రైతుల తో కలిసి బీఆర్ ఎస్ నేతల నిరసన
ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు, పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి గంటలు తరబడి నిలబడి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చోడ మండల అధ్యక్షులు ఏనుగు క్రిష్ణ రెడ్డి అన్నారు. మొన్న పత్తి విత్తనాలు... నేడు యూరియా కొరత తెచ్చి రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపుమేరకు ఇచ్చోడ మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. యూరియా కొరత పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి ఖండిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో నిరసన తెలిపారు