కోరుట్ల: నీట మునిగిన మొక్కజొన్న కంకులు జగ్గాసాగర్, వెల్లుల్ల, ఆత్మకూర్.వర్షపు నీటితో తడిసినా మొక్క జొన్న నష్టపోయిన రైతులు
మెట్పల్లి నీట మునిగిన మొక్కజొన్న కంకులు మెట్పల్లి మండలం జగ్గాసాగర్, వెల్లుల్ల, ఆత్మకూర్ గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. పంట కోసి, తోటల్లో కుప్పలుగా ఉంచిన మొక్కజొన్న కంకులు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. దీంతో చేతికందిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. తడిసిపోయిన పంటను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.