అనంతపురం జిల్లా కల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి ప్రయాణికులు తోసేయడంతో ప్రయాణికుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 2, 2025
అనంతపురం జిల్లా కల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు కు చెందిన చెన్న వీర అనే యువకుడికి గాయాలయ్యాయి. ఇద్దరు ప్రయాణికులు కొట్లాడుతుండగా ఒకసారిగా తనను దొబ్బినట్లుగా దీంతో వాకిలి వద్ద ఉన్న తాను కింద పడిపోయానని తెలిపాడు. దీంతో అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.