రైళ్లలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని గంజాయితో పాటు నగదును స్వాధీనం .రైల్వే నోడల్ అధికారి
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ఒంగోలు రైల్వేస్టేషన్లో పోలీసుల విసృత తనిఖీలు. విశాఖపట్నం నుంచి వస్తున్న పూరి ఎక్స్ప్రెస్ రైలులో జి ఆర్ పి పోలీస్, రైల్వే పోలీస్, ఈగల్ టీం తనిఖీలు చేపట్టగా అందులో కేరళకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఐదు కేజీల 350 గ్రాములు గంజాయి, 75 వేల రూపాయలు నగదు, అదే రైలులో వేరే భోగిలో ప్రయాణిస్తున్న ఒరిస్సా కు చెందిన మహిళ వద్ద నుంచి 8 కేజీలు గంజాయి ని స్వాధీనం చేసుకొని వారు ఇరువురిని అరెస్ట్ చేయడం జరిగిందని గుంతకల్లు రైల్వే నోడల్ అధికారి నెల్లూరు రైల్వే డిఎస్పి జి మురళీధర్ తెలిపారు. ఒంగోలు నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.