విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు రూ.6.22 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని కేవలం 45 రోజుల్లోనే హాస్టల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పూర్తి అవుతుందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి పేర్కొన్నారు.