బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వైసీపీ నాయకులు చెల్లుబోయిన గోపాలకృష్ణ, తలశిల రఘురాంతో పాటు పలువురు కార్యకర్తలు విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.