కనిగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సూచించారు. కనిగిరి-హనుమంతునిపాడు రహదారిలో ఉన్న అటవీశాఖ నగరవనంలో అడవి శాఖ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శనివారం ఎమ్మెల్యే పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మన గ్రామాలను, పట్టణాలను శ్రమదానంతో బాగు చేసుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.