కళ్యాణ్ దుర్గం బైపాస్ లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
అనంతపురం నగరంలోని కళ్యాణ్ దుర్గం బైపాస్ లో ఉన్న జూడియో షోరూం వద్ద బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో విజయ్ బాబు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో అనంతపురం టౌన్ నుండి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు విజయబాబుపై దాడి చేసి ద్విచక్ర వాహనం కీస్ తీసుకొని పరార్ అయ్యారు. విజయ్ బాబుకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.