మంత్రాలయం: పెద్ద కడబూరు మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం : మండల ప్రత్యేక అధికారి
పెద్ద కడబూరు: మండల కేంద్రంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని మండల ప్రత్యేక అధికారి నాగరాజు రావు హెచ్చరించారు. మండలంలోని కొన్ని శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు.