పూతలపట్టు: కాణిపాకం ఆలయంలో ఉగ్రవాద నిరోధక వ్యాయామంపై చర్చ
చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భద్రతా సమీక్షా సమావేశం జరిగింది. ఆలయ భద్రతను దృష్టిలో ఉంచుకొని రాత్రి ఆలయం మూసిన అనంతరం రాష్ట్ర ఆక్టోపస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ ఉగ్రవాద నిరోధక వ్యాయామం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ అధ్యక్షతన ఆలయ మీటింగ్ హాలులో సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజశేఖర్ రాజు, నందకిషోర్, ఆక్టోపస్ డిఎస్పి తిరుమలయ్య, చిత్తూరు డిఎస్పి సాయినాథ్, సీఐ శ్రీధర్ నాయుడు, చిత్తూరు పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.