తాడిపత్రి: తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఆటోను టిప్పర్ ఢీకొని ఒకరు మృతి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఆటోను టిప్పర్ ఢీకొని ఎల్లనూరుకు చెందిన కట్టెల కుల్లాయప్ప మృతి చెందాడు. సిద్ధార్థ గ్రానైట్ వద్ద ఆటో యూటర్న్ తీసుకుంటండంగా టిప్పర్ ఢీకొనడంతో ఆటోలో ఉన్న కుళ్లాయప్ప కింద పడిపోయాడు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.