కరీంనగర్: అంద విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సులో వెలుతు శ్లోకం ఆలపించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మంగళవారం సాయంత్రం 4గంటలకు కరీంనగర్ ప్రభుత్వ అందుల పాఠశాల విద్యార్థులు ఆలపించిన " దివ్య దృష్టి" వీడియో ఆల్బమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని తమ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్య దృష్టి గేయాలు ఆలపించిన అంధ విద్యార్థులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ నుండి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆల్బమ్ ఆవిష్కరణ అనంతరం అంధ విద్యార్థులతో కలిసి "శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద" అంటు శ్లోకం ఆలపించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. అనంతరం తెలంగాణ సెక్రటేరియట్ విషయాలను వారికి వివరించారు.