రవాణా శాఖ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, రెన్యువల్ తదితర ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. కూకట్పల్లి ఆర్టిఏ కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు గంటలకొద్ది వేచి చూశారు.