ఖమ్మం అర్బన్: శాస్త్రీయ భావాల వైపు ప్రజలను మరల్చాలి ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.చంద్రశేఖర్ రావు
శాస్త్రీయ భావాల వైపు ప్రజల్ని మరల్చాల్సిన అవసరం ఎంత గానో ఉందని, అందుకు జెవివి చేస్తున్న కృషి అభినందనీయమని ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక జిలా ప్లీనం ప్రారంభ సభ జిల్లా అధ్యక్షుడు వి.మోహన్ అధ్యక్షత న ఖమ్మం లోని మంచికంటి మీటింగ్ హాల్ లో జరిగింది.