ఉదయగిరి: కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో ప్రమాదం నుండి బయట పడ్డ దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు
కర్నూల్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నేలకుర్తి రమేష్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అకిరా నందన్ క్షేమంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సులు అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3:00 సమయంలో పెద్ద శబ్దంతో మంటలు వ్యాప్తి చెందాయన్నారు. పక్కనే ఉన్న కిటికీలను బద్దలు కొట్టి కుటుంబం మొత్తం బయటకు దూకేసామని తెలిపారు.