అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆదివారం భారతదేశ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.స్థానిక కదిరి రోడ్డు, టిప్పుసుల్తాన్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ధామి ఉపన్యాసం ఇవ్వనున్నట్లు అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు శాయిలోకేష్, బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి సభా వేదిక ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు.