వైసిపి హిట్ లిస్టులోకి నన్ను చేర్చారు : నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం
వైసిపి డిజిటల్ బుక్ లోకి తను ఫిర్యాదు చేసినందుకు వైసిపి హిట్టు లిస్టులోకి నన్ను చేర్చారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన చిలకలూరిపేట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ అధికార ఎక్స్ ఖాతాలో బెదిరింపులు చేస్తూ రావు సుబ్రహ్మణ్యం పేరుతో పోస్ట్ పెట్టారని పేర్కొన్నారు. కూటమికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవమని జగన్ హయాంలో జరిగిన దాడులు చూసే కూటమికి మద్దతు ఇచ్చామని తెలిపారు.