దళితుడిపై SI దౌర్జన్యానికి నిరసనగా ఈనెల 26న రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ముట్టడి:MSP జిల్లా అధ్యక్షులు మందా పిచ్చయ్య మాదిగ
Mylavaram, NTR | Sep 21, 2025 దళితుడిపై అకారణంగా దౌర్జన్యానికి పాల్పడిన ఎస్సై మోహన్ రావు ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో రెడ్డిగూడెం పోలీస్స్టేషన్ ను ముట్టడించనున్నట్లు ఎం ఎస్ పి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మందా పిచ్చయ్య మాదిగ ప్రకటించారు. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో రెడ్డిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు.