భీమిలి: మిదిలాపురి ఉడాకాలనీ రహదారిలో బడ్డీలను తొలగించిన జీవీఎంసీ అధికారులు
మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీ రహదారిలో పాదచారుల రహదారిలో ఆక్రమణ బడ్డీలను తొలగింపు కార్యక్రమం జీవీఎంసీ సిబ్బంది నిర్వహించారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ లక్ష్మీ ఆధ్వర్యంలో సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు జీవీఎంసీ సిబ్బంది తొలగింపు నిర్వహించారు. బడ్డీలను తొలగించెందుకు వచ్చిన సిబ్బందిని బడ్డీల వారు కాస్త సమయం ఇవ్వాలని కోరగా ఎటువంటి సమయం ఇచ్చేది లేదు అని జీవీఎంసీ సిబ్బంది బడ్డీలను జేసీబీ సహాయంతో తొలగించారు.