భూపాలపల్లి: దసరా సందర్భంగా ప్రజల భద్రత – జాగ్రత్తలతోనే సుఖశాంతులు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
దసరా పండుగ సమయానికి విద్యార్థులకు సెలవులు రావడంతో జిల్లా ప్రజలు గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఇలాంటి వేళల్లో చోరీలు, దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజల భద్రత కొరకు పోలీసులు అదనపు గస్తీ ఏర్పాటు చేసి, క్రైమ్ విభాగం ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, చెరువులు, బావులు దగ్గర చిన్నారులు ఆడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.