వైరా: కారేపల్లిలోని క్షుద్ర పూజల తో ఘరానా మోసం
Wyra, Khammam | Sep 19, 2025 నిమ్మకాయలను, రాళ్లను గాలిలో లేపి ప్రజలను నమ్మిస్తున్న భూత వైద్యులు.అనారోగ్యవంతుల కుటుంబమే వారి టార్గెట్.డబ్బులు ముట్టగానే మొఖం చాటేసి తప్పించుకుని తిరుగుతున్న కేటుగాళ్లు.ఇటీవల ఓ రెండు, మూడు కుటుంబాలకు జరిగిన మోసం బయటపడటంతో పరారీలో ఉన్న భూత వైద్యులు.కారేపల్లి మండలం, జైత్రం తండా స్మశాన వాటికలో క్షుద్ర పూజల సంఘటన కలకలం.అవి చూసి భయభ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు.లక్షల రూపాయలు పోగొట్టుకొని మోసపోయామని లబో దిబో మంటున్న బాధితులు,మనిషి విజ్ఞానం పెరిగి అంచలంచలుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మూఢనమ్మకాలనే అజ్ఞానం మనుషులను పీడిస్తున్నది.