గుంటూరు: అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్
Guntur, Guntur | Aug 12, 2025 పరిశుభ్రతతో, పచ్చదనంతో, పర్యావరణహిత, సింగల్ యూస్ ప్లాస్టిక్ రహిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుటకు రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వార్ ఆన్ సింగల్ యూస్ ప్లాస్టిక్ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్లైమెట్ యాక్షన్ ప్లాన్ అండ్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.