జనగాం: MLA కడియం శ్రీహరి పై రాజయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ లో రాజయ్య శవయాత్ర
ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన అంచుత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం స్టేషన్ ఘనపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.దిష్టిబొమ్మపై రాసలీల రాజయ్య అని స్టికర్ వేసి చెప్పులు దండతో ఊరేగించారు.రాజయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి డప్పు చప్పులతో స్టేషన్ ఘన్పూర్ ఎస్సీ కాలనీ నుండి గాంధీ విగ్రహం వరకు శవయాత్ర నిర్వహించారు.అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.