కుప్పం: FFC ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన
కుప్పం మండలం పలార్లపల్లి వద్ద ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) ఏర్పాటుకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. 18.5 ఎకరాల్లో 15.66 కోట్ల పెట్టుబడితో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కు ఏర్పాటుకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ MSME పార్కులను ఏర్పాటు చేయనున్నారు.