శంకరంపేట ఏ: పెద్ద శంకరంపేట మండల పరిధిలో 8 ఏళ్ల బాలికపై చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధింపు
ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ మెదక్ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి మంగళవారం తెలిపారు.. పెద్ద శంకరంపేట మండలం మడ్చెట్ పల్లి గ్రామానికి చెందిన తలారి మోహన్ 8 ఏళ్ల బాలికపై చాక్లెట్ ఆశ చూపి 2020 లో అత్యాచారం జరపగా అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా మెదక్ జిల్లా కోర్టు లో కేసు విచారణ చేపట్టి తలారి మోహన్ దొషిగా తేలుస్తూ నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఐదువేల జరిమానా విధించినట్లు పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.