అనంతగిరి: రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: శాంతి నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం అనంతగిరి మండలం శాంతినగర్ లోని పాలేరు వాగుపై 52 కోట్ల రూపాయలతో నిర్మించే రాజీవ్ శాంతి నగర్ ఎత్తి పోతల పథకంను మంత్రి పరిశీలించారు. శాంతి నగర్ లో పాలేరు వాగుపై మరొక చెక్ డ్యామ్ నిర్మిస్తామని అన్నారు.