మార్కాపురం: బొడిచర్ల గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు, రాకపోకలకు అంతరాయం
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగు తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తుంది. తుపాన్ ప్రభావం తగ్గినప్పటికీ గుండ్లకమ్మ వాగు ప్రవాహం తగ్గలేదు. దీంతో కంభం బొడిచర్ల తర్లపాడు మార్కాపురం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు ఎవరు వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.