రాజంపేట: జిల్లా కేంద్రం సాధించడానికి ప్రాణాలు అర్పిస్తా: రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ను సాధించడానికి తన ప్రాణాలైనా అర్పిస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ మరి రవి అన్నారు. రాజంపేటలో ఆయన మాట్లాడుతూ ఎంతటి వారైనా ఎదిరించడానికి తాను సిద్ధమని పార్టీలకి అతీతంగా తనతో కలిసి రావాలని ఆయన మనవి చేశారు. టిడిపికి ఓట్లు వేసిన ఓటర్లు గౌరవించైన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన కోరారు.