గద్వాల్: కేటీఆర్ అబద్ధాల రాజకీయాలను మానుకోవాలి:బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాల సభలో కేటీఆర్ చేసిన ప్రసంగంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు సోమవారం మధ్యాహ్నం మండిపడ్డారు. గత పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గద్వాల మున్సిపాలిటీకి రూ. 100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అబద్ధాల రాజకీయాలను ఆపి నిజాలను ప్రజలకు చెప్పాలని రామాంజనేయులు కోరారు.