కోడుమూరు: కృష్ణాపురంలో రైతన్నా మీకోసం, ప్రకృతి సేద్యంతో పెట్టుబడి తగ్గించుకోవాలని వ్యవసాయ అధికారి సూచన
కోడుమూరు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో గురువారం రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ గౌడ్ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పంచ సూత్రాలు అమలు చేస్తూ రైతాంగాన్ని వ్యవసాయంలో నవ శకం తీసుకురావడానికి కృషి చేస్తుందని తెలిపారు. రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ పెట్టుబడి తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణా రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.